ఎక్కడ బెల్లం వుంటే అక్కడ చీమలు చేరతాయి అని సామెత. అలా ఎక్కడ నాటకప్రదర్శన వున్నా, పోటీలు వున్నా కొందరు వీరాభిమానులు అక్కడ చేరతారు. అలాంటి వారు 'కారుమూరి సీతారామయ్య' గారు. ఒక పరిషత్తు జరిపిన నాటక పోటీలకు గుణనిర్ణేతలుగా వున్నాం. అపుడు పరిచయము సీతారామయ్యగారు. ఆయన కట్టు, తీరు చూడగానే 'నటుడు' అనిపిస్తుంది. 'నాకు సినిమా రంగము అంటే ప్రాణం అని సినిమా నటులు చెప్పరుగాని, నాటకరంగానికి చెందిన వారు మాత్రం 'నాకు నాటకం ఆరో ప్రాణము' అని చెప్పుకుంటారు. నాటి చలనచిత్ర నటులందరికీ నాటకరంగమే భిక్ష పెట్టింది. సినిమాకి పూర్వ రూపము నాటకం. అది సజీవమైతే, సినిమా కృత్రిమం. సీతారామయ్యగారు ఉత్సాహముతో అప్పుడప్పుడు సినిమాల్లో వేస్తున్నా నాటకరంగమే ఆయన ఇష్టరంగం. - రావి కొండలరావు

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good