'ఛ...నోర్ముయ్‌'' అనే పేరుతో ఈ లఘు నాటికలు (స్కిట్స్‌) గతంలో చెకుముకి పిల్లల మాసపత్రికలో వెలువడ్డాయి. ఆ తర్వాత మానవ వికాస వేదిక ప్రచురించిన మానవ వికాసం పత్రికలోనూ ప్రచురించారు. మానవ వికాసం పత్రిక ఇప్పుడు స్వేచ్ఛాలోచన అనే పేరుతో వస్తూంది.

ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్న పరిశీలనకూ, పరిశోధనకూ దారితీస్తుంది. మానవ విజ్ఞానమంతా ''ప్రశ్న'' దగ్గర్నుంచే మొదలైంది. ఎందుకు? ఏమిటీ? ఎలా? ఎవరు ? ఎక్కడ? ఎప్పుడు? ...ఇలాంటి ప్రశ్నలు జీవితావసరం. ప్రశ్నించడం మానేయటం ఎదుగుదలకు గుర్తు ? కానే కాదు. 'ప్రశ్న' ఎప్పుడూ జవాబు వెదకడానికి పునాది వేస్తుంది. 'వర్షం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? నిప్పు అంటే ఏంటీ? తాకితే ఏమవుతుంది? మెరుపులు అంటే ఏమిటీ? ఎందుకు వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు వేలాది పిల్లల తలల్లోంచి వరదలా వస్తాయి. ఆ వరదను ఆపకుండా అనుమతించడం వలన మనకు చాలా లాభాలున్నాయి. మనకు కూడా జవాబులు తెలియని ప్రశ్నలున్నాయని ముందుగా మనకు అర్ధమవుతుంది. అప్పటి దాకా 'నాకన్నీ తెలుసు' అనబడే అహంకారం తగ్గుతుంది. మనిషి ఎదగాలంటే ముందు అహంకారాన్ని వదులుకోవాలి. ఇది మొదటి లాభం.

పిల్లలు అడిగిన ప్రశ్నకు జవాబు మనకు తెలియనప్పుడు ''ఛ...నోర్ముయ్‌'' అనే కంటే దీనికి జవాబు నాకు రాదు అంటే కూడా లాభాలున్నాయి మనకు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good