గ్రీకు తత్వశాస్త్ర స్వర్ణయుగం బిసి నాల్గవ శతాబ్దం. బానిస సమాజం అత్యున్నత స్థాయికి చేరి, సంఘర్షణలు, సంక్షోభాలకు గురవుతున్న కాలమది. ఓ వైపున బానిస యజమానులు అపారమైఔన సంపదను కూడబెట్టుకున్నారు. మరోవైపున బానిసలు, ఇతర చేతివృత్లువారు తీవ్ర పేదరికంలో కూరుకుపోయారు. ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతున్న రోజులవి. ఆ కాలంలోనే తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు వికసించాయి. డెమోక్రిటస్‌ భౌతిక వాదానికి ప్రాతినిధ్యం వహించాడు. పరమాణు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు.

ప్లాటో భావవాద తత్వవేత్త. జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం, భావన అని రెండుగా విభజించడం ఆయన ప్రధాన సిద్ధాంతం. కేవలం విజ్ఞాన శాస్త్రానికే పరిమితమయితే సత్యాన్ని సంపూర్ణంగా కనుగొనడం అసాధ్యం అని ప్లాటో చెప్పాడు. విజ్ఞానశాస్త్ర సూత్రాలతో, భావనలను మిళితం చేసినప్పుడు మాత్రమే సత్యాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది. ఆలోచనలకు, ఉనికికి మధ్య సంబంధం గురించి వివరించిన మొట్టమొదటి తత్వశాస్త్రవేత్త ప్లాటో.

ప్రాచీన గ్రీకు తత్వవేత్తలలో అత్యున్నతుడు అరిస్టాటిల్‌. అరిస్టాటిల్‌ మొత్తం విజ్ఞానాన్ని దాని ప్రయోజనము వివరించే అంశం ఆధారంగా సైద్ధాంతిక, ఆచరణాత్మక, సృజనాత్మక అని మూడు విభాగాలుగా వర్గీకరించాడు. తత్వశాస్త్రం సైద్ధాంతిక విభాగంలోకి, విజ్ఞాన శాస్త్రం ఆచరణాత్మక విభాగంలోకి, కళలు సృజనాత్మక విభాగంలోకి వస్తాయి. ప్రామాణిక తర్కం, లేదా శాస్త్రబద్ధ ఆలోచన రూపకల్పనకు మూల పురుషునిగా కూడ అరిస్టాటిల్‌ సర్వవ్యాపిత గుర్తింపు పొందాడు.

ప్రాచీన తత్వశాస్త్రంలో ఇలాంటి అపురూపమైన ఘట్టాన్ని పరిచయం చేసేది ఈ చిన్న పుస్తకం.

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good