పిల్లలకే నా హృదయం అంకితం :    వి.ఎ. సుహోమ్లీన్‌స్కీ , అనువాదం: ఆర్వీయార్                                                                                మామూలుగా ఆరోగ్యంగా ఉండే పిల్లవాడికెవడికైనా ఈనాడు సెకండరీ విద్య బోధించవచ్చు. పిల్లల్ని తెలివైనవాళ్ళూ, మంద బుద్ధులు అని విభజించనవసరం లేదు. ఈ అభిప్రాయాలు కొత్తవేం కాకపోయినా దృఢంగా నమ్మి సిద్ధాంత రీత్యా, ఆచరణ రీత్యా ఋజువుపరిచిన వ్యక్తి, వి.ఎ. సు మ్లీన్‌స్కీ. పెంపకాన్నీ, బోధననీ ఒకే విద్యాక్రమంలో మిళితం చెయ్యాలని చాలా కాలంగా అభ్యుదయ అధ్యాపకులు కన్న కలలను తన కృషి ద్వారా సాకారం చేసిన వ్యక్తి సు మ్లీన్‌స్కీ. తన జీవితమంతా విద్యాబోధనకే అంకితం చేశాడు. సమాజం కేంద్రంగానే పిల్లల్ని పెంచాలన్న మకరెంకో సమష్ఠి బోధనా సిద్ధాంతాన్ని ఆచరణలో సాధించాడు. ఉన్నత నైతిక విలువలూ, పౌరధర్మం ఆధారంగా ఉండే విద్యావిధానం రూపొందాలని ఆశించాడు. పిల్లలకు బోధించాలనుకున్న అధ్యాపకుడికి సహజంగా పిల్లలంటే ఇష్టపడే తత్వం, పిల్లవాడి హృదయాన్ని అన్వేషించే లక్షణం ఉండాలంటాడు. పిల్లలు తమ కుటుంబాన్నీ, పాఠశాలనీ, పనినీ, జ్ఞానాన్నీ, మాతృదేశాన్నీ ప్రేమించేలా ఉపాధ్యాయుడు బోధించగలడన్నది సు మ్లీన్‌స్కీ నమ్మకం. పవ్లీష్‌లోని విద్యాలయం అధిపతిగా ఇతడు తన అభిప్రాయాలను సాధించి చూపాడు. అనేక గ్రంథాలు రాశాడు. వాటిల్లో ''పిల్లలకే నా హృదయం అంకితం'' అన్న గ్రంథానికి విశేష ప్రాచుర్యం లభించింది. మహా బోధకుని పుష్కలమైన ఆచరణ యోగ్యమైన అనుభవసారం ఈ గ్రంథం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good