గత 60 సంవత్సరాలలో విద్యారంగంలో ఊహకందిన మార్పులు అనేకం వచ్చాయి. సమాజంలోని వివిధ స్ధాయిలకు తగ్గట్లుగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఏది ఎంపిక చేసుకోవాలనే ప్రశ్నకు అవకాశమే ఉండేది కాదు. అందుబాటులో ఉన్న ఒకటి, రెండు పాఠశాల/కళాశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేవారు. నేడు అవకాశాలు పెరిగాయి. తల్లిదండ్రుల ఆర్ధిక, సాంఘీక స్ధితిగతులకు అనుగుణంగా పాఠశాలలు/కళాశాలలు విపరీతంగా ఏర్పడ్డాయి. ఈ స్ధితిలో సరైన పాఠశాలలు/కళాశాలను ఎంపిక చేసుకోవడం, పిల్లలకు తగిన మార్గ దర్శకత్వం ఇస్తూ వారిని చదివించడం తల్లిదండ్రులకు ఒక 'ఛాలెంజ్‌'గా మారింది.
మన విద్యావ్యవస్ధ పిల్లలను ప్రేరేపించే బదులు, వారిని క్రుంగదీస్తున్నది. సమాజానికి వారిని దగ్గర చేసే బదులు దూరం చేస్తున్నది. సమానత్వం బదులు అసమానతలను పెంచుతున్నది. ఎందరిలోనో నిరాశా నిస్పృహలను కలిగిస్తున్నది. ఈ స్ధితిలో 'వ్యవస్ధ' లోని లోపాల నుంచి మన పిల్లలను రక్షించుకుంటూ వారిని విజయంపై నడిపించడం మనందరి ముందున్న పెద్ద సవాలుగా పేర్కొనవచ్చు.
ఈ పుస్తక రచయిత శ్రీ దేశినేని వేంకటేశ్వరరావుగారు కేవలం అధ్యాపకుడిగానే కాక, విద్యామనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా విద్యారంగాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి, పిల్లలపై ఏ ఏ అంశాలుఏ ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో, ఆయా సందర్భాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలో లోతుగా పరిశీలించిన వ్యక్తి. పిల్లలు మోసే పుస్తకాల బరువు గురించే చాలామంది ఆలోచిస్తారుకాని, అర్ధంకాని అనుభవ పూర్వకంగా తాను గమనించిన పలు విషయాలను తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు చదువుల్లో అనునిత్యం ఎదురయ్యే పలు సమస్యలను స్పృశిస్తూ, పిల్లల చదువు, ందులో తల్లిదండ్రుల పాత్ర వంటి విషయాలలో తాను భాగస్వామిగా ఉంటూ హితబోధగా కాకుండా ఆచరణాత్మకమైన సూచనలు చేశారు. పిల్లలు అటు చదువుల్లోనూ, ఇటు జీవితంలోనూ ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం కేవలం తల్లిదండ్రులకే కాదు మొత్తం సమాజానికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
ప్లిలల విషయంలో రెండు అంశాలు ప్రధానం. ఒకటి తల్లిదండ్రుల భాగస్వామ్యం, రెండు సరైన చదివే పద్ధతులు. తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా, ప్రతిస్పందనల ద్వారా తమ పిల్లలు అటు చదువులోనూ, ఇటు జీవితంలోనూ సాధించే విజయాలకు లేదా ఎదుర్కొనే వైఫల్యాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకులు కాగలరు.
ఈ పుస్తకంలో పేర్కొన్న విషయాలన్నీ ఆచరణసాధ్యమైనవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good