ఇది పెద్దలతో వచ్చిన సమస్య. సమాజంలో వచ్చిన సమస్య.

మనపిల్లల్ని చుట్టుముట్టి వేధిస్తున్న సమస్యలన్నీ ఇలా పెద్దల్నించి వచ్చినవేనంటారు నీల్‌. ఇవి పిల్లల్ని తీవ్రంగా హింసిస్తాయని, దీంతో పిల్లలు కూడా మళ్ళీ మనలాంటి పెద్దలుగానే మారతారనే ఆవేదన పడతాడాయన.

ఈ పుస్తకం వీటిని చాలా తరచి తరచి చర్చిస్తుంది. పిల్లల చిన్న కదలికా పెద్దలకి ఎంత వికృతంగా కనపడుతుందో అదెన్ని సమస్యల్ని తెచ్చి పెడుతుందో ఇది అద్దంలోలా చూపిస్తుంది.

మనం పెద్దలం కొంచెం మారితే, మన దృక్పధంలో కొంచెం మార్పు వస్తే పిల్లల్ని ఎలా చూడవచ్చునో, మనకున్న సమస్యలు ఎంత సహజమైనవో కూడా నీల్‌ సోదాహరణంగా వివరిస్తాడు.

ఈ సంఘర్షణ పిల్లల సంపూర్ణ వికాసానికి తీవ్ర అవరోధంగా వుందని నీల్‌ అనుభవం. దేశదేశాల్లో తిరిగి, ఎందరెందరితోనూ మాట్లాడి సమాజాల స్వభావాల్ని, వాటి రాజకీయాల్ని వడపోసి ఆయన కొన్ని తీవ్ర నిర్ధారణకొస్తాడు. అంతిమంగా దీనికి బలవుతున్నది పిల్లలన్న నిర్ణయానికి వస్తాడు

జీవితమంతా పిల్లల కోసం, పిల్లల చదువుల మీదా వికాసం మీదా చేసిన ప్రయోగాల కోసం వెచ్చించిన నీల్‌ మనకోసం అంటే మన పెద్దలకోసం చాలా చెపుతాడు. ఒక్కోసారి తీవ్రంగా కోప్పడి మందలిస్తాడు కూడా. ఆవేదనని ఆగ్రహంగా కూడా వ్యక్తం చేస్తాడు.

ఈ పుస్తకం రోజువారీగా మనం పిల్లల్ని ఎంత తప్పుడు దృష్టితో చూస్తున్నామో చెపుతుంది.

Pages : 142

Write a review

Note: HTML is not translated!
Bad           Good