5000 పేర్లు వున్న ఏకైక పుస్తకం - యండమూరి వీరేంద్రనాథ్‌
అందమైన పేరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
'స్నేహ' - మంచి పేరు. 'సంధ్య' చాలా మందికి వుండే అందమైన పేరు. కానీ - 'స్నేహ సంధ్య' మరింత అందమైన కాంబినేషన్‌. వినగానే 'బావుంది' అనిపించేటంత ముచ్చటైన పేరు. నీహారిక, వేదసంహిత లాంటి ఎన్నో అందమైన పేర్లను పాఠకలోకానికి పరిచయం చేసిన యండమూరి వీరేంద్రనాథ్‌ కలంలోంచి జాలువారిన ముత్యాల జల్లు ఈ పుస్తకం. గతంలో వచ్చిన పిల్లల పేర్ల పుస్తకాలకి భిన్నంగా - మరో 500 పేర్లు అధికంగా - నవ్యత కోరుకునే పాఠకులకి బహుమతిగా - యండమూరి అందించే ముచ్చటయిన పేర్ల పుస్తకం ''పిల్లల పేర్ల ప్రపంచం'' చదవండి. ఎంపిక చేసుకోండి. తెలుగులో ఇన్ని (5000) పేర్లతో వెలువడుతున్న తొలి పుస్తకం ఇది. అంతేకాదు జన్మనక్షత్రాలకు అనుగుణంగా వీలైనన్ని పేర్లు పొందుపరుచబడ్డ పుస్తకం కూడా. చివరన పిల్లలు ఉండవలసిన సగటు బరువును సూచించే పట్టిక కూడా ఇందులో వుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good