మానవ జీవితంలో అత్యంత కీలకమయింది సంతానం.
పిల్లలను కని, పెండం ఒక మరపురాని అద్భుత ప్రక్రియ. ఒక జాతి నర్మాణం ఈ ప్రక్రియ మీదే ఆధారపడి వుంటుంది. అందుకే దీనికి అంతటి ప్రాముఖ్యత యివ్వబడుతుంది.
ఈతరం వారికే కాదు... ఏ తరం వారికయినా ఈ విజ్ఞానం ఎంతగానో వుపయుక్తమవుతుంది.
అసలు ఒక బిడ్డ జన్మించడానికి అవసరమయినవి ఏమిటో తెలుసా...? మగ మరియు ఆడ సెక్స్ కణాలు కావాలి. ఈ కణాలు సరయిన సమయం, సరయిన ప్రదేశంలో కలిసినప్పుడు ఆ రెండూ కలిసి ఒకే కణంగా మారతాయి. ఈ కణం ఒక చుక్క కంటే కూడా అతి చిన్నదిగా వుంటుంది. యింత స్వల్పమయిన జీవకణం నుండి ఒక ప్రాణి వుద్భవిస్తుంది.
తరతరాలనుండి వచ్చే అనువంశీక లక్షణాలు అంటే కాళ్ళు, తలవెంట్రుకల రంగు, శరీర నిర్మాణం, మానసిక శక్తి యిటువంటివి తల్లి దండ్రుల నుండి బిడ్డకి సంక్రమించడానికి వేలరకాల సంక్లిష్టమయిన రసాయినిక పదార్థాలు కారకమవుతాయి. వాటినే సైన్స్ 'జీన్స్' అని పిలుస్తుంది....
పేజీలు : 128