పిల్లల్ని పెంచడం ఒక గొప్ప కళ అన్నాడొక ప్రముఖ రచయిత. కళ సంగతి ఎలా ఉన్నా, పిల్లల్ని చెడుమార్గంలో పడకుండా, వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి భావి జీవితానికి పునాది వేయాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులది. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెంచటంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, మంచి అలవాట్ల గురించి అవగాహన కల్పించాలి.

ఈ పుస్తకంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారలోపం వల్ల వచ్చే వ్యాధుల గురించి, పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత గురించి, ప్రవర్తనాపరమైన సమస్యల గురించి, చదువు సామర్థ్యలోపాల గురించి, పిల్లల్లో వచ్చే సామాన్య వ్యాధుల గురించి, యుక్త వయస్సులో బాల బాలికల్లో వచ్చే మార్పుల గురించి సంక్షిప్తంగా తెలియజేసిన పుస్తకం.

బాల్యం నుంచి యుక్తవయస్సు వచ్చే దాకా పిల్లల్ని ఎలా పెంచాలో, ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలో, భావి జీవితానికి పటిష్టమైన పునాది ఎలా వేయాలో పెద్దలు గ్రహించటానికి ఈ పుస్తకాన్ని ఒక మార్గదర్శకంగా తీర్చిదిద్దారు డాక్టర్‌ కె.ఉమాదేవి.

పేజీలు : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good