సుసంస్కారానికి, చక్కటి జీవన విధానానికి, మంచి అలవాట్లకి బీజం పడేది బాల్యంలోనే. ముఖ్యంగా ఏడు-పథ్నాలుగు ఏళ్ళ మధ్య వయసులో. నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు పూర్వం పిల్లలకి చిన్న చిన్న కథల ద్వారా నీతిని బోధించేవారు. ఇందులోని ప్రతీ కథ వెనక అలాంటి నీతి సందేశం దాగి వుంది. ఈ కథలన్నీ పాఠక పిల్లల మనసుల్లోకి ఎన్నో రెట్ల వేగంగా త్వరగా, తేలిగ్గా ఇంకేలా చక్కటి ఉదాహరణలతో రాయబడ్డాయి. చీకట్లో జారిపోయిన ఖరీదైన బంగారు నాణాన్ని పైసా ఖరీదు చేసే కొవ్వొత్తి వెలుగులో ఎలా వెతకచ్చో, అలాగే క్లిష్టమైన విషయాలని కూడా ఈ చిన్న కథల ద్వారా తెలుసుకోవచ్చు. నేర్పించవచ్చు. మంచిని ప్రేరేపించే ఈ పాజిటివ్ కథలని తల్లిదండ్రులు తమ పిల్లల చేత చదివిస్తే వారిలో మంచి బీజాలు పడే అవకాశం ఉంటుంది.
పిల్లల పుట్టిన రోజుకి ఇవ్వదగ్గ మంచి కానుక పిల్లల హిత కథలు పుస్తకం.
Rs.120.00
Out Of Stock
-
+