ఏ రంగంలో నైనా నాయకత్వం వహించే వారిని నాయకులంటారు . నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే అబ్బుతాయనే వాదన ఒక వైపు, నాయకులు పరిస్థితులను బట్టి తయారవుతారనే వాదన మొరోవైపు వినిపిస్తుంటుంది. నాయకులంటే సహజంగా మనకు గంభీరంగా ఉపన్యసిస్తూ , ప్రజల్ని ఉత్తేజపరుస్తూ , వీరపూజలు అందుకునే వారు కనిపిస్తారు. దేశ స్వాతంత్య సమరంలో ప్రజలచే వీరపూజలు అందుకున్న నాయకులంటే గాంధీజీ నేతాజీ, తిలక్, లాలాలజపతి రాయ్, టంగుటూరి ప్రకాశం మొదలైన వారు మనకు కనిపిస్తారు. వీరపుజలు అందుకున్న వీరందరి వెనుక నిశబ్దంగా , నిర్మాణాత్మకంగా ఉద్యమాలకు ఊపిరిపోసిన మరిందరో నాయకమన్యులు చరిత్రలో ఉన్నారు. వారికి ప్రజాకర్షణ లేకపోయినా తమ జీవితాల్ని జాతికి దారపోసిన వారిలో గోపాల కృష్ణ గోఖలే ప్రముఖులు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good