విద్యార్ధుల శక్తి సామర్ధ్యాలు అనేక రంగాలలో విస్తరించి వుంటాయి. వాటిని సరిగా సద్వినియోగ పరచుకునే విధానాలు తెలిసే విద్యార్ధుల విజయ సాధనలో ప్రముఖ పాత్ర వహించేది వారిలోని భావా వేష తెలివితేటలు  వాటిని అభివృద్ధి పరచుకోవటానికి ప్రతి విద్యార్ధి ప్రయత్నించాలి. అలాగే పోటి పరీక్షలలో విజయం సాధించాలంటే పట్టుదల కృషి కావాలి. విజయ సాధనకు ఈ పుస్తకము భౌతిక శాస్త్రము నిర్వచనాలు - సూత్రాలు ఏంతో ఉపకరిస్తుంది. 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల భౌతిక శాస్త్రములోని నిర్వచనాలు - సూత్రాలు చాప్టర్ వారీగా ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాము. శాస్త్రవేత్తలు - వారు కనిపెట్టిన అంశాలు, పరికరాలు, వాని ఉపయోగములు భౌతిక శాస్త్రంలో మీకు కనపడే అనేక అంశాల విలువలు మొదలైనవి ఎన్నో ఈ పుస్తకములో చేర్చడమైనది. నాకు ఈ విధంగా సేకరణ చేసి విద్యార్ధలకు అవసరమైన రీతిలో అందించే విధంగా తగు సూచనలు యిచ్చిన శ్రీ పుణ్యం కామేశ్వర శర్మ విజయవాడ వార్కి నా సహోపాధ్యాయులను కృతజ్ఞతాభి వందనములు తెలియజేస్తున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good