వ్యాపార రంగంలో ఉన్నత స్ధాయికి ఎదిగినవారు, కాలదోషం వలన పాతాళలోకానికి దిగజారినవారు ఉన్నారు. ఉన్నతమైన పదవులను నిర్వహించి, జీవితంలో ఎదగలేని వారూ ఉన్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్ధితికి చేరి, మరలా మొదటి స్ధితికి చేరినవారూ ఉన్నారు. కాని కాలానుగుణంగా తమను తాము మలుచుకున్న ఒక చేతిపని (హ్యాండ్‌ వర్క్‌) వాడు కాని లేక ఒక కళాకారుడు (ఆర్టిస్ట్‌) ఎంతో అభివృద్ధి సాధించినట్లు చరిత్ర చెబుతుంది.

అంతేకాదు మారుతున్న టెక్నాలజీతోపాటు తమను తాము మలుచుకోలేని (అప్‌డేట్‌) వారు ఎంత గొప్పవారైనా చరిత్రలో కనుమరుగైనవారూ ఉన్నారు. నేను చూసింది చెబుతున్నాను. నాకు తెలిసిన రాజ్‌కపూర్‌, వెంకట్రావు అనే ఇద్దరు ఆర్టిస్టులు చాలా మంచి చిత్రాలను గీసేవారు. గోడలమీద చాలా అలవోకగా ముత్యాల్లాంటి అక్షరాలను వ్రాసేవారు.

కాని కంప్యూటర్‌లో 'ఫోటోషాప్‌' సాఫ్ట్‌వేర్‌ రంగ ప్రవేశం చేయడంతో ఈ ఆర్టిస్టులు ఎన్నో గంటలు కష్టపడి క్రియేట్‌ చేసే కళాఖండాలను ఒక కంప్యూటర్‌ డిజైనర్‌ ఒక గంటలో ఎంతో సృజనాత్మకతతో తయారు చేయగలుగుతున్నాడు. 100 మంది ఆర్టిస్టులు చేసే పనిని, ఫోటోషాప్‌లో ఒక వ్యక్తి ఒక గంటలో చేయవచ్చును. అందువలన ఈ ఆర్టిస్టుల బ్రష్‌కు పనే లేకుండా పోయింది. ఎంతో మంది ఆర్టిస్టులు రోడ్డున పడ్డారు. వారిలో వెంకట్రావు అనే ఆర్టిస్టు ఒకతను. ఇతనికి చదువు వుంది. కాలానుగుణంగా మారిన కంప్యూటర్‌ టెక్నాలజీ ఫోటోషాప్‌ గురించి తెలుసుకోలేదు.

అందరు ఆర్టిస్టులు అలా లేరు. వారిలో రాజ్‌కపూర్‌ అనే ఆర్టిస్టు ఫోటోషాప్‌, కొరెల్‌డ్రా మొదలైన గ్రాఫిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ల గురించి తెలుసుకొని, తమని కాలానుగుణంగా మార్చుకొని ఎంతో అభివృద్ధిని సాధించారు.

పెద్దగా చదువులేకపోయినా ఈ ఫోటోషాప్‌ను చాలా తేలికగా నేర్చుకోవచ్చును. ఫోటోషాప్‌ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది. మీ చేతిలో ఒక కంప్యూటర్‌ ఉంటే చాలు మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. స్వయం ఉపాధికి ఫోటోషాప్‌ దగ్గరి దారి. మీరు కొంతమందికి ఉపాధిని కూడా కల్పించవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good