మతం అంటే ఏమిటి? ఏ మతం ఏ సందర్భంలో ఏ సంఘ ఔన్నత్యం కోసం పుట్టింది? ఏ మతం ఏమి చెప్పింది? అన్ని మతాలసారం ఒక్కటేనా? వీటన్నిటి సంక్షిప్త పరిశీలనే ఈ చిన్న పుస్తకం.

సామాజిక సంక్షోభ సమయాల్లో మానవునికీ కొన్ని కట్టుబాట్లు తప్పనిసరయ్యాయి. సమాజం అల్లకల్లోలంగా తయారయ్యింది. వాటి నివారణకు దేవుడి అవసరం ఏర్పడింది. ప్రవక్తలు వారి బోధనల్నే దేవుడి పరంగా ప్రజలకు ఉద్భోధించారు. అన్ని మతాలసారం సమాజ సౌభాగ్యమే. మత విద్వేషాలకంటే మతసామరస్యం నెలకొల్పడం నేటి కర్తవ్యం అని విశదీకరించటమే ఈ పుస్తక లక్ష్యం. ఏ మతం ఎప్పుడు ఏ కాలమాన పరిస్థితుల్లో పుట్టిందో దానివల్ల ఏ సమాజం ఏ ప్రయోజనాన్ని సాధించిందో చెప్తూనే వాటి మధ్య గల వ్యత్యాసాలు విశదీకరిస్తుందీ గ్రంథం. 'ప్రపంచ ప్రసిద్ధ మతాలసారాన్నీ సులభంగా అర్థం చేసుకోవడానికి తప్పక చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good