దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుల్లో ఒకరూ, ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారులైన కీ.శే. కామ్రేడ్‌ కంభంపాటి సత్యనారాయణగారు (సీనియర్‌) రాసిన 'మార్క్సిజం మూలసూత్రాలు' అనే ఈ పుస్తకం కమ్యూనిస్టు కార్యకర్తలకు కరదీపిక లాంటిది. తత్వశాస్త్ర సాంఘిక పునాదుల నుండి భౌతికాంశాల విశదీకరణ వరకూ సూక్ష్మస్థాయిలో కంభంపాటిగారు ఈ పుస్తకంలో రాశారు.

గతితార్కిక భౌతికవాదంలోని మౌలికాంశాలనూ, చారిత్రక భౌతికవాదంలోని ప్రధానాంశాలనూ ఆయన ప్రజ్ఞావంతంగా పేర్కొన్నారు. సమాజాన్ని గురించిన మానవ దృక్పథంలో విప్లవం ఎందుకు వచ్చిందీ, భౌతిక జీవితానికి ఉత్పత్తి విధానమే కీలకమనీ, సామాజిక వ్యవస్థ పునాది, ఉపనిర్మాణం అంటే ఏమిటి, చరిత్రలో సామాజిక ఆర్థిక నిర్మాణాల మార్పుకు మూలకారణాలేమిటి లాంటి అంశాలను, సమాజంలో వర్గాలు ఎందుకుంటాయి, వర్గపోరాటం ఎందుకు జరుగుతుంది, శ్రామిక వర్గ పోరాట రూపాలు ఏ విధంగా ఉంటాయో ఈ పుస్తకంలో రాశారు.

కమ్యూనిస్టు కార్యకర్తలకే కాకుండా, హేతువాదులకూ, విజ్ఞానశాస్త్ర సూత్రాలను అవగాహన చేసుకోవాలనుకునే వారికీ ఈ పుస్తకం గొప్పగా ఉపకరిస్తుంది.

Pages : 185

Write a review

Note: HTML is not translated!
Bad           Good