కౌట్స్కీ రష్యన్ శ్రామికవర్గ విప్లవంపై బురద జల్లడమేగాక, విప్లవాత్మక మార్క్సిజానికి ద్రోహం చేస్తూ, సోషలిస్టు విప్లవం, శ్రామివర్గ నియంతృత్వం విషయంలో కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌ల బోధనలకి వ్యతిరేకంగా బాహాటంగా బయటకు వచ్చాడు.
అసలతడు మార్క్సిస్ట్ ప్రాథమిక సూత్రమైన కార్మికవర్గ నియంతృత్వాన్నే తప్పుపడుతూ, దోపిడీదార్లయిన బూర్జువాలకు కూడా ప్రజాస్వామిక హక్కులు ఉండాలంటూ, 'పరిశుద్ధ ప్రజాస్వామ్యం' పేరుతో బూర్జువా ప్రజాస్వామ్యాన్ని తలకెత్తుకుని, కార్మికవర్గ ప్రయోజనాలను దెబ్బతీసే రాతలు రాసి విప్లవ విద్రోహిగా మారాడు. ఈ విషయాల్ని బట్టబయలు చేసేందుకూ, శ్రామివర్గ నియంతృత్వానికి సంబంధించిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని మరింత వివరించి, ఆ సిద్ధాంతాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేసి, సోషలిస్టు నిర్మాణానికి సంబంధించి అతి ముఖ్యమైన సమస్యల్ని వివరించేందుకూ లెనిన్ ఈ పుస్తకం రాశాడు.
పేజీలు : 103