రాజకీయ సిద్ధాంతాలచరిత్ర చరిత్ర మాత్రమే కాదు; అది రాజకీయ ప్రామాణిక గ్రంథాల పరిశీలన కూడ. ఈ సిద్ధాంత వ్యాసరచనలో పరిగణనలోనికి తీసుకున్న కాలంలో రాజకీయ ప్రామాణిక గ్రంథాలనేవి అసలు లేనేలేవు. నేను పరిశీలించిన ప్రామాణిక గ్రంథాలన్నీ మతపరమైతే వాటి లక్ష్యం బౌద్దమతవ్యాప్తి. వాటిలో రాజకీయపరమైన ఆధారాలు అతి సాధారణమైనవి, తేలికపాటివి, అప్రధానమైనవి. ఆ విధంగా చూచేట్లయితే అవి రోమన్ న్యాయవాదులు, తొలినాటి క్రైస్తవ ఫాదరీలు, పదహారవ శతాబ్దినాటి సంస్కర్తల అభిప్రాయాలను పోలి ఉంటాయి. వాటి నుండి పరోక్షంగా మనం రాజకీయ ఆలోచనా ధోరణులను సేకరించాల్సి ఉంటుంది. అటువంటి రచయితల్లో రాజకీయ చింతన అచేతనరూపంలో ఉంటుంది. ఈ కారణంవల్లనే నేను రచయితల్ని చాలావరకు కాలక్రమ రీతిలో పరిచయం చేసుకుంటూ వచ్చాను. అయితే రాజకీయ చింతనకు సంబంధించిన అంశాలను బేరీజు వేసేప్పుడు మాత్రం తప్పని సరిగా ఆ కాలపు స్ఫూర్తితో అది తులతూగుతుందనే విషయాన్ని నేను గ్రహింపులో వుంచుకొనక పోలేదు.
Rs.240.00
In Stock
-
+