''పెట్టుబడి'' గ్రంథం వెలువడి నూటయాభై సంవత్సరాలైనా, దాని ప్రాధాన్యత నానాటికి పెరుగుతూనే ఉందిగానీ, తరగడం లేదు. అందులో విశ్లేషించిన అంశాలు, ప్రతిపాదించిన సూత్రీకరణలు సజీవంగా నేటికీ మన సామాజిక జీవనంలో ప్రస్ఫూటంగా కనిపిస్తున్నందువల్లనే ఆ గ్రంథానికి అంత ప్రాధాన్యత ఉంది. 2008లో అమెరికాతో ప్రారంభమై ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలనూ, వాటితో వ్యాపార లావాదేవీలు కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలను సహితం కుదిపివేసిన ఆర్థిక సంక్షోభం అనంతరం మార్క్సిస్టు మేధావులతోపాటుగా ఇతర మేధావులు, ఆర్థికవేత్తలు పెట్టుబడి గ్రంథాన్ని తిరిగి అధ్యయనం చేస్తున్నారన్న వార్తలు ఆ గ్రంథ ప్రాధాన్యతను నొక్కి వక్కాణిస్తున్నాయి. ప్రపంచ వ్యాపితంగా లక్షల సంఖ్యలో పెట్టుబడి గ్రంథ కాపీలు పునర్ముద్రించబడ్డాయి.

చరిత్రగతినీ, మన కాలపు మహద్విజయాలనూ, అపజయాలనూ అవగాహన చేసుకోడానికి సహాయపడగలిగిన భావాలకు ''పెట్టుబడి'' గ్రంథం ఒక అక్షయనిధి. చారిత్రక పరిణామ నూతన అనుభవాలనుపయోగించి, భావజాలాన్ని, ఘటనలను సృజనాత్మకంగా వివరించగలిగిన మార్క్సిస్టు-లెనినిస్టు మూల సూత్రాలకు ''పెట్టుబడి'' గ్రంథం పునాదిరాయి. అలాంటి గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రతి సామాజిక శాస్త్రవేత్తకూ, ప్రత్యేకించి ప్రతి మార్క్సిస్టు-లెనినిస్టుకూ శ్రమభరితమైనా, సంతోషకరమైన ఉత్తమ కర్తవ్యం కావాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good