తెలుగు రాష్ట్రాలలోని జానపద కళారూపాలలో గొబ్బి చెప్పుకోదగ్గ కళారూపం. చాలా కళారూపాలు మత ఆచరణ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. గొబ్బి కూడా మత ఆచరణ విధానంలో భాగంగా అలరారుతోంది. మత ఆచరణ విధానంలో భాగంగా ఉండే కళారూపాలే కలకాలం నిలిచి ఉంటాయి. గొబ్బి సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రత్యేక కళారూపంగా వందలాదది సంవత్సరాల నుండి ప్రదర్శింపబడుతోంది. గొబ్బిలో స్త్రీలు మాత్రమే పాల్గొంటారు. పురుషులు పాల్గొనరు. ప్రపంచంలోని ప్రతి కళారూపం దానిని ప్రదర్శించే జాతి ప్రత్యేకతల్ని చాటినట్లే, గొబ్బి కళారూపం కూడా ద్రావిడులైన తెలుగు, తమిళుల ప్రత్యేకతల్ని చాటుతున్నాయి. గొబ్బి తూర్పు సాగర తీరప్రాంతంలో మాత్రమే ఉన్న కళారూపం. అంటే భంగాళఖాతం సాగరతీరానికి సంబంధించింది. అయితే ఈ కళారూపాన్ని పశ్చిమ బెంగాళ్, ఒరిస్సా ప్రజలు ప్రదర్శించరు. ఆర్యులలో ఈ కళారూపం లేదు. ద్రావిడులలో కూడా బంగాళాఖాతం తీర ప్రాంత ప్రజల్లో మాత్రమే మనుగడలో ఉంది. కోస్తా ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ గొబ్బి కళారూపం విరివిగా కనిపిస్తుంది.....
పేజీలు : 218