పనిలో శ్రేష్టతకు నూతన ప్రమాణాలు.

వ్యాపార ప్రపంచంలో ప్రవేశించే ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని చదివి, ఇందులోని సారాంశాన్ని ఆకళింపు చేసుకుని, అందలి జ్ఞానాన్ని అన్వయించుకున్నట్లయితే, వారికి సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు, స్వీయగౌరవం సంప్రాప్తించడం తధ్యం. 

- బాబ్‌ బర్గ్‌, 'ది గో గివర్‌' సహ రచయిత

సుబ్రతో బాగ్చి ది ప్రొఫెషనల్‌ నాయకత్వం మీద నేర్పుగా అల్లిన అపూరూప గ్రంధం. ప్రపంచాన్ని పునర్నిర్మించడంలో సారధ్యం వహించే వారెవరైనా తప్పక చదవవలసిన పుస్తకం. 

- విజయ్‌ గోవిందరాజన్‌, ప్రొఫెసర్‌, టక్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, డార్ట్‌మౌత్‌

లోతయిన సహానుభూతితో హృదయాన్ని కదిలిస్తుంది... విలువైన, విభిన్నమైన అనుభవాల నుండి, తమ జీవిత గమనాన్ని వివేకంగా, నిజాయితీగా నిర్వహించుకోవడమెలాగో బాగ్చి వివరిస్తారు, చక్కని విషయాలు పొందుపరచిన ఈ పుస్తకం విస్తారమైన పాఠకాదరణ పొందగలదనడంలో సందేహం లేదు. 

- రామచంద్ర గుహ, 'ఇండియా ఆఫ్టర్‌ గాంధీ' రచయిత

ఈ పుస్తకానికెంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది వృత్తి ధార్మికతను స్ఫూర్తిదాయకమైన సామర్థ్యంతో సంపూర్ణ నిజాయితీతో మనకు అందజేస్తుంది - కాలగమనాన్ని మలుపు తిప్పగల అత్యంత ప్రతిభావంతులకు ఇది కీలక లక్షణం.

- బిల్‌ డ్రేటన్‌, 'అశోక' వ్యవస్థాపకులు మరియు సిఈఓ

Pages : 260

Write a review

Note: HTML is not translated!
Bad           Good