Rs.100.00
Out Of Stock
-
+
మంచి వక్తలు తమ ఉపన్యాసాల ద్వారా ప్రజల హృదయాలలోకి అతి త్వరగా చేరువ అవుతారు. అంతవరకు పరిచయం లేని ప్రేక్షకులు, వక్త మధ్య తెలియని అవినాభావ సంబంధ ఏర్పడుతుంది. అభిమానం పెరుగుతుంది. ఇంత త్వరగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవడం, ఆకట్టుకోవడం, ప్రసంగికుని వాక్పటిమ, అద్భుత శైలి, అవగాహన అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీజీ, నేతాజీ, జవహర్లాల్, సర్ధార్ వల్లభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలామ్ ఎలాంటి అద్ధుబత ప్రసంగాలు చేస్తే స్వాతంత్య్ర సమరంలో లక్షల మంది జేజేలు పలికారో, ఎంత మంది వెంట నడిచారో మనకు తెలిసినదే. ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవసేవని మాధవసేవగా ఆచరణమార్గంలో పెట్టి కోట్ల మందిని మార్చిన భగవాన్ శ్రీసత్యసాయి, పోప్ జాన్పాల్, దలైలామా గురించి మనం విన్నాము, స్వయంగా చూశాము. వీరిలో ముఖ్యమైన అంశం - ఎంత గొప్పగా ప్రసంగిస్తారో, అంత చిత్తశుద్ధితో ఆచరించి చూపిన మహనీయులు....