దేశం అభివృద్ధి చెందాలన్నా, పతనమై పోవాలన్నా అది యువతరంపై ఆధారపడి ఉంది. ఆదర్శభావాలు కలిగిన యువతరం వల్లనే సమాజం పురోభివృద్ధి సాధించగలుగుతుంది. యువతరం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటారు. దేశానికి యువతరమూ వెన్నెముక వంటిది అంటారు. మెరుగైన సమాజాన్ని సాధించాలంటే అది యువతరం చేతిలోనే ఉందని పెద్దలంటారు. దానికోసమే..ఈనాటి యువతరం ఆలోచనా ధోరణుల్లో నేను గమనించిన అంశాలు, వాటిలో నన్ను అమితంగా ఆకర్షించినవి, ఆలోచనకు దారితీసినవి, ఆందోళనకు గురి చేసినవి మొత్తంగా నూరు అంశాలను లేఖ రూపంలో ఇక్కడ పొందుపరుస్తున్నాను. వాటిపై నా అభిప్రాయాలతో పాటు, ప్రముఖుల అభిప్రాయాలను, సూక్తులగా, నిర్వచనాలుగా గుర్తు పెట్టుకోదగిన మంచి మాటలను కూడా పేర్కొన్నాను.

యుక్తవయసులోని వారిని స్నేహితునిలా చూడాలి కానీ, వయసు తారతమ్యాన్ని అనుసరించి ఒకరు పెద్ద, మరొకరు చిన్న అనే పద్ధతి పాటించకూడదు. వయసులో పెద్దవారిని గౌరవించడం మన సంస్కారం. అయితే మనకంటే చిన్నవారి బాగోగులపై శ్రద్ధ పెట్టడం, వారికి చక్కని స్నేహితునిగా మెలగడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి మీరూ, నేనూ మంచిమిత్రులం. అందుకే దీనిని ఆత్మీయ లేఖగా అభివర్నించాను.

అందుకోండి నా లేఖను. మన గురించి మనం చర్చించుకునే ఈ చర్చావేదికలో నూరు అంశాలను అయిదు భాగాలుగా విభజించాను. అవి 1.నేర్చుకోవాల్సినవి 2. విడిచిపెట్టాల్సినవి, 3. పాటించవలసినవి, 4. తీర్చిదిద్దుకోవాల్సినవి. 5. సాధన చేయాల్సినవి అనేవి. - రచయిత 

Write a review

Note: HTML is not translated!
Bad           Good