స్వామి వివేకానందకు భారతదేశమంటే అత్యంత ప్రీతి.  ఈ ఆధునిక యుగంలో క్రొత్త ప్రాడక్ట్స్‌ను ప్రవేశపెట్టే ముందు కంపెనీలు ఏవిధంగా మార్కెట్‌ రిసెర్చి చేసి వాటిని అమలు పరుస్తున్నారో అదేవిధంగా స్వామి వివేకానంద దేశమంతా పాదయాత్ర చేసి దేశ పునరుద్ధరణకు మార్గాన్ని కనుగొన్నారు.  దారిద్య్రంతో బాధపడుతూ, సోమరితనంలో నిద్రిస్తున్న తన దేశాన్ని పునరుద్ధరించడానికి ప్రజలలో కార్యతత్పరత, అవిరామంగా కష్టపడి పనిచెయ్యటం మొదలైన గుణాలను పెంపొందించడం అత్యంత అవసరమని గుర్తించారు.  పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక ప్రభోధనలను చేసి, వాళ్ళ నుండి భారతదేశ పునరుద్ధరణకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాలను తీసుకువచ్చారు.
పారిశ్రామిక/వ్యాపారవేత్త అవటం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.  ప్రస్తుతం దేశంలో అనేక మేనేజ్‌మెంటు విద్యా సంస్ధలు చక్కని తర్ఫీదును ఇస్తున్న అవకాశాల వల్ల యువతరం స్వయంఆ తమ పారిశ్రామిక/ వ్యాపార సంస్థలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్నారు.  గత కొన్ని దశాబ్దాలలో పారిశ్రామిక/వ్యాపార సంస్థలు అనుసరిస్తున్న పద్ధతుల్లో మౌలికమైన మార్పులు వచ్చాయి.  స్వామి వివేకానంద ప్రబోధించిన 'కర్మయోగం' ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలలో 'కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి' కార్యక్రమాల రూపంలో ప్రజలకు చాలా మేలు చేస్తోంది.
పారిశ్రామిక/వ్యాపారవేత్తలు తమ సంస్థల నిర్వహణలో స్వామి వివేకానంద సందేశాలను అనుసరించడం ద్వారా చాలా అత్యున్నత స్థితికి ఎదగవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good