నాకు జీవితమంటే ఒక్కక్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తికాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి వంటింది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక' -జార్జి బెర్నార్డ్‌షా.

సంకల్పం, సత్ప్రయోజనం, శాంతి ప్రపూర్ణ జీవనానికై జ్ఞానసముపార్జన-ఇదొక ఉత్తేజకరమైన గాధ. మరింత ధైర్యంతో, సమతూకంతో, సమృద్ధితో, ఆనందంతో జీవించడానికి అంచెలంచెల ప్రయత్నాన్ని అందిస్తుందీ గ్రంథం. అద్భుత కధనంతో అలరించే ఈ గాథ 'జీవితం' గతి తప్పినప్పుడు జూలియస్‌ మాంటెల్‌ అనే న్యాయవాది ఎలా తన ఆధ్యాత్మిక సంక్షోభాన్ని ఎదుర్కొని అధిగమించాడో చెప్పే అసాధారణ కథ. తన జీవిత గమనాన్ని సమూలంగా మార్చేసిన ప్రస్ధానంలో అతను కనుగొన్న శక్తిమంతమైన, వివేక పూరితమైన, ఆచరణ సాధ్యమైన పాఠాలు ఈ క్రింది సూత్రాలనందిస్తాయి.

1.ఆనందకరమైన ఆలోచనలు పెంచుకో

2. జీవితాశయాన్ని గుర్తించి అనుసరించు

3. స్వీయక్రమశిక్షణను పెంచుకొని, ధైర్యం అలవరుచుకో

4. సమయమే అతిముఖ్యమైన సరుకని గుర్తించు

5. అనుబంధాలను పోషించుకుంటూ ప్రతిరోజూ సంపూర్ణంగా జీవించు.

ఇది సంచలనాత్మకమైన రచన. మీ జీవితాన్ని ఆశీర్వదించే పుస్తకం. మన జీవితాలను మార్చేసే సాధనాలను జీవిత తాత్వికతతో మిళితం చేసి అత్యంత ఆకర్షమైన కథగా మలచిన, మీ జీవితాన్ని మార్చేసే ఉత్తేజకరమైన రచన. రాబిన్‌ ఎస్‌.శర్మ ఇంగ్లీషులో వ్రాసిన ది మాంక్‌ హూ సోల్డ్‌ హిస్‌ ఫెరారికి తెలుగు అనువాదం చేసింది మృణాళిని గారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good