సంపదకు సంసిద్ధులు కండి
డబ్బును సంపాదించే మార్గాన్ని మీకు బోధించడం ద్వారా ఈ పుస్తకం మీ జీవితాన్ని ఆసాంతం మార్చేస్తుంది. 'ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి' అనే పుస్తకం, రచయిత సాగించిన పరిశోధన, విశ్లేషణల తాలూకు 'విజయ రహస్యాలపై ఆధారపడింది. ఇది గొప్ప, గొప్ప ఐశ్వర్యవంతులు, విజేతల స్వానుభవ, మేథోమథనం ప్రతిఫలాల్ని ప్రతిబింబిస్తుంది.
విజయ సాధన కోసం ఆండ్రూ కార్నెగీ అనుసరించి ఐంద్రజాలిక సూత్రమే ఈ పుస్తకానికి ఆధారం. ఆయన ఏ యువజనులకైతే తన సూత్రాన్ని అందించారో, ఏ యువజనులకైతే ఆ సూత్రాన్ని పాటించడం ద్వారా విజయాల్ని సాధించారో, ఆయా వ్యక్తుల విజయగాథలే తన సూత్రానికి ప్రామాణికాలుగా కార్నెగీ స్వీకరించారు.
ఆ ఐంద్రజాలిక రహస్యాన్నే ఈ పుస్తకం మీకు బోధిస్తుంది. కార్నెగీ వంటి అద్భుత వ్యక్తుల విజయ రహస్యాల్ని ఈ పుస్తకం మీకు విప్పి చెబుతుంది. 'మీరేం చేయాలి?' అన్న విషయాన్ని మాత్రమే కాక, 'దాన్నెలా చేయాలి?' అన్న విషయాన్ని కూడా ఇది మీకు వివరిస్తుంది. ఈ పుస్తకంలో విశదపరిచిన అతిసరళమైన కిటుకుల్ని అభ్యసించినట్లయితే, నిజమైన విజయంపై మీరు విజయం సాధించినట్టే! అంతేకాదు, మీరు జీవితంలో ఏం సాధించాలనుకున్నా అది ఇట్టే మీ చేతికి అందిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good