Rs.125.00
Out Of Stock
-
+
అంతేకాదు ముందు తారాల వారి అనుభవసారాన్ని , జ్ఞానాన్ని గడించి , వాటికి మరికొన్ని జోడించి మీరు అనుభవం సంపాదిస్తూ, పరిస్థితుల కనుగుణంగా మిమ్మల్ని మీరు తీర్చి దిద్దుకుంటూ తరువాత తరం వారికి మీ స్కిల్ల్స్ నాలెడ్జ్ యాటిట్యూడ్ అందించే భాద్యత మీ మీద వుంది. ఎవరైనా చీకటిలో కూర్చుని బాధపడుతూ వుంటే వారిని అందులోంచి బయటకి లాగే ప్రయత్నం చేసి వారు అలాంటి పరిస్థితి లో వున్నా మరొకరిని వెలికి తీసుకువచ్చే ధర్యాన్ని మీరందరూ చేస్తారు. మీలో అంత శక్తి సామర్ధ్యాలున్నాయి. ప్రతి వ్యక్తి కొన్ని ఎమోషన్స్ వుంటాయి. ఎమోషన్ అనేది జీవన ప్రయాణంలో అంతర్భగమే. ఇగో అంటే అహంకారం, ఇగో వుండాలి కాని అదీ ఒక మోతాదులో ఉండాలి. లైఫ్ అంటే జీవితం మనకు ప్రక్రుతి ప్రసాదించిన గొప్పవరం ఆ వరాన్ని అందంగా అనుకూలంగా ఎవరికీ వారే మలచుకోవాలి. అది మన చేతుల్లోనే వుంటుంది.