సాహిత్యరీత్యా చేసిన అనుకరణ 'పేరడీ'. సున్నితమైన హాస్యం, సుకుమారమైన చమత్కారం పేరడీ యొక్క లక్షణం, లక్ష్యం. మూలాన్ని గుర్తుకుతెస్తూనే, మూలం కంటే భిన్నంగా వుండి, కొంచెం వెక్కిరిస్తున్నట్టుండి, హాస్యోత్పత్తి చెయ్యడం పేరడీ. అట్లాగని కేవలం గుడ్డిగా అనుకరించడం కాదు. మూల రచయిత శైలిని అనుకరిస్తూ పేరడిస్ట్‌ తన సృజనాత్మకతని ప్రదర్శించాలి. విమర్శిస్తూనే, ఆహ్లాదకరంగా వుండి నవ్వించాలి. మూలరచయితను నొప్పించకుండా, ఆ పేరడీని చదివి మూల రచయిత సైతం నవ్వుకోవాలి. జరుక్‌శాస్త్రి తన రచనకు చేసిన పేరడీని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ కూడా మెచ్చుకున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good