“ఇప్పటి వరకు మనం మన బలహీనతలనే ఎక్స్పోజ్ చేశాం. ఇప్పుడిప్పుడే కదా మన అసలు వ్యక్తిత్వాలేంటో తెలుస్తున్నాయి.”
”పూర్తిగా తెలిసేలోపు నీకు ప్రసాద్తో పెళ్ళయిపోతుంది. హేపీగా లైఫ్ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెడతావు...” నవ్వుతూ అన్నాడు సంజయ్.
సౌజన్య మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. డల్ అయిపోయింది. అది ఇట్టే కనిపెట్టేశాడతను.
”ప్రసాద్ సంగతి వచ్చినప్పుడల్లా ఎందుకు డల్ అవుతున్నావ్? బెంగా...?” ఆట పట్టిస్తూ అన్నాడు సంజయ్.
క్షణంలో తేరుకొని చిరునవ్వు నవ్వుతూ-
”అవును బెంగే... నెలరోజులు క్యాంపని చెప్పి వెళ్ళిన మనిషి నెలలు గడిచిపోతున్నా, రాకపోతే బెంగగా వుండదా?” చిరుకోపంగా అంది సౌజన్య.
”అవును! ఎందుకు వుండదు. ఫోన్స్ చేస్తున్నాడా?”
”ఆ! రోజూ ఫ్యాషన్ సెంటర్కి చేస్తాడు. ఓ అరగంట మాట్లాడతాడనుకో. కొలీగ్స్ ఏడిపిస్తారని నేనే ఫోన్ పెట్టేయమంటాను. అవునూ, మీ మహాలక్ష్మి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా?” అడిగింది సౌజన్య.

Write a review

Note: HTML is not translated!
Bad           Good