వివాహ వ్యవస్థ ఆంతర్యాన్ని విడమరిచి పెళ్ళి తర్వాత ఉత్పన్నమయ్యే అనేక శారీరక, మానసిక, భావనాత్మక, అధ్యాత్మిక మరియు ఇతర విశేష అంశాలను, సమస్యలకు సమాధానాలను తెలియజెప్పి, దంపతుల ఆనందమయ వైవాహిక జీవితానికి సహకరించే నేస్తం ఈ "పెళ్ళి పుస్తకం". పెళ్ళి ఐన వారు, పెళ్ళి కాబోయేవారు తప్పక చదువవలసిన సందేశాల సమాహారం. ప్రేమ, స్నేహం, కరుణ, క్షమ అనే దైవగుణాలే పునాదులుగా గల కుటుంబ వ్యవస్థను ధ్యానం అనే మాధ్యమంతో నిర్మించండి. స్వార్థం, మోసం, దురాశ, ఆవేశం, అహంకారం, అవకాశవాదం అనే రాక్షస గుణాలను సంపూర్ణంగా నిర్మూలిస్తూ శివ పార్వతుల్లా, లక్ష్మీనారాయణుల్లా కలకాలం కలిసి ఆనందంగా జీవించండి!
మీకు శుభం కలుగుగాక! సర్వేజనా స్సుఖినోభవంతు!
- స్వామి మైత్రేయ

Write a review

Note: HTML is not translated!
Bad           Good