'పెళ్ళి యితర కథలు' పుస్తకంలో ప్రయోగం, పెళ్ళి, వెన్నెముక, ఓ పెళ్ళి కథ, ధనయవ్వనం, పబ్బులూ - హక్కులు, ఆల్‌ ది బెస్ట్‌ అనే 7 కథలు ఉన్నాయి.

ప్రయోగం :

నరేంద్రకి ఎటూ పాలుబోవడం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ చిక్కొచ్చి పడుతుందో, భవిష్యత్‌ జీవితం ఎలా అంధకార బంధురం అవుతుందోననే సందేహంతో సతమతమవుతున్నాడు. ఒక మగవాడు పెళ్ళి గురించి ఇంత భయపడతాడంటే, నిర్ణయం తీసుకోవటానికి ఇంత కంగారుపడతాడంటే ఎవరూ నమ్మరేమోగాని, నరేంద్ర విషయంలో అది నిజమే.

నరేంద్ర మామూలుగా మంచివాడు. బుద్ధిగా చదువుకున్నాడు. చదువుతోపాటు సంగీత సాహిత్యాల్లో ఆసక్తి పెంచుకున్నాడు. స్నేహపాత్రుడు. సమాజం ఏ విషయాల్లో మంచివైపు నడుస్తోందో, ఏ విషయాల్లో చెడిపోతోందో తెలుసుకోగల వివేకవంతుడు. స్వార్థపరుడు కాదుగానీ, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని గ్రహించగలిగినంత లౌక్యుడు. చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించుకున్న సమర్థుడు. ఇట్లాంటి గుణాభిరాముడైన నరేంద్రకి పెళ్ళి విషయం ఒకటి కొరుకుడు పడకుండా ఉంది. ప్రేమ గురించి కూడా అతను తగు మాత్రం కలలు కన్నాడు. తీరా తనకు సునంద అనే అమ్మాయి పరిచయమై, ఆ అమ్మాయిని తను ప్రేమిస్తున్నాడా అనే అనుమానం వచ్చేసరికి భయపడ్డాడు......

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good