రంగనాయకమ్మ గారు రచించిన "పేకమేడలు మరియు చదువుకున్న కమల" అనే 2 నవలల సంపుటం ఈ పుస్తకం.
***
భాను పగలబడి నవ్వుతోంది. ఉలిక్కిపడి లేచాను. ఏదో భయం ముంచుకొచ్చింది. భాను ఏడుస్తూందేమో! ఈ అర్ధరాత్రి! ఒక్కతీ! చాలా సేపు చీకటిలోనే లేచికూర్చున్నాను. ఒకసారి వెళ్ళివద్దామా అనిపించింది. కానీ నేను అంత అర్ధరాత్రి వెళ్తే అతను ఏమైనా అనుకోవచ్చు. అనవచ్చు కూడా. ఆలోచనలోనే మగతగా నిద్రపట్టింది కొంత సేపు.

ఎవరో కంగారు కంగారుగా లేపుతున్నారు! తుళ్ళిపడ్డాను!

అతను, భాను భర్త రాజశేఖరం! మనిషంతా కంపించిపోతున్నాడు. "భాను .... లేదు. ఈ ఉత్తరాలు...." అంటున్నాడు తడబడుతూ........

Write a review

Note: HTML is not translated!
Bad           Good