దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకి తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కథలివి. ఈ కథల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ...అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాథశర్మకే చాతనవును. చకచ్చికితాలయిన అక్షరాలూ, పదాల పరుగుల ఉరవడీ, కెరటాల్లా విరిగి పడే వాక్యాల విరుపులూ వీటితో...ఈ కథలన్నీ మనల్సి వెంటాడుతాయి. కన్నీళ్ళూ, వేదనలూ నిండిన ఈ కథలు మరోసారి చదవడానికి భయపెడుతూనే, మళ్ళీ మళ్ళీ చదించేలా చేస్తాయి. అదే వీటి గొప్పతనం.

- పంతుల జోగారావు

కోట్లాది మంది జీవిస్తున్న ఈ దేశంలో దీనజనులకేసి మాత్రమే అపేక్షగా చూసే చూపూ, వాస్తవికతా పరిధిని దాటిపోని యదార్థవాద దృక్పథమూ, మానవీయ విలువలకు ప్రతీకలుగా మారే వ్యక్తులతో అలవోకగా మమేకమయ్యే ధర్మ నిగ్రహమూ, మొదలు  పెట్టిన నాలుగు వాక్యాలలోపే కథకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకునే నేర్పూ, నింపాదిగా, ఒడుపుగా, హుందాగా సాగిపోయే కథనమూ, సదవగాహన తీరాలకు చేర్చే శిల్పమూ, సామాజిక వ్యవస్ధపట్ల నిరసనను పెల్లుబికేలా చేసే నిపుణతా... వెరసి జీవితాన్ని కథలా, కరుణరసాత్మక కావ్యంలా మలిచే కళాకారుడి కౌశలమే ఎ.ఎన్‌.జగన్నాథశర్మ కథలు. 

- మధురాంతకం నరేంద్ర

Write a review

Note: HTML is not translated!
Bad           Good