శరీరాన్ని ఆపాదమస్తకమూ జలదరింపజేసే పీడకలగని ఉలిక్కిపడి మేలుకున్నాడు కాళిదాసు. అతడు కళ్ళు నులుముకుని లేచి బల్లమీద వున్న దీపాన్ని పెద్దదిగా చేసి వాకిటి తలుపు తీశాడు. క్రూరమైన చల్లని గాలి విసురుగా లోపలికి వచ్చింది. అర్థరాత్రి దాటి వుంటుంది. వంగపండురంగులో వున్న చంద్రబింబం అస్తమించ బోతున్నది. నక్షత్రాలు 'మినుకు మినుకు' మని మెరుస్తున్నాయి. చంద్రబింబం ప్రక్కన ఒక నక్షత్రమూ, క్రింద మరో నక్షత్రమూ ఉజ్జ్వలంగా వెలుగుతున్నాయి.

ఉత్తరంవైపు వరండాలో పడుకుని ఇద్దరు పిల్లలు నిద్ర పోతున్నారు. వారిద్దరూ ప్రతిరాత్రీ చదువుకునేందుకు అక్కడికి వస్తారు. కాళిదాసు రాత్రి నిద్రవచ్చేదాకా వారికి పాఠాలు చెబుతాడు. తర్వాత వాళ్ళిద్దరూ నెమ్మదిగా చదువుకుంటూ ఏ పన్నెండు గంటలవరకో మేలుకుని తర్వాత తమకు తెలియకుండానే నిద్రాదేవత ఒడిలోకి జారిపోతారు. పరీక్షలను గురించిన భయంతో మళ్ళీ తెల్లవారుజామునే లేచి తూగుతూ, జోగుతూ తెల్లవారే దాకా చదువుతారు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good