మాల్గుడి సాహిత్యం నుండి మచ్చుతునక పెద్దపులి ఆత్మకథ
సున్నితమైన హాస్యం, వ్యంగం, శ్లేష మేళవించి గంభీరమైన విషయాలను కూడా వినోదాత్మకంగా రాసిన రచయిత నారాయణ్‌.  తన తొలి ఆత్మకథాత్మక నవల స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ (1935) తోనే గ్రాహంగ్రీన్‌ వంటి ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు.  ఈయనను తెలుగులో పట్టుకోవటమే ఒక సాహసం.  పెద్దపులి ఆత్మకథ, మాటకారి చదువుతున్నంతసేపూ నారాయణ్‌ తెలుగులోరాస్తే ఇలాగే ఉంటుందనిపించేటంత సహజ సుందరంగా ఉంది శైలి.  మాల్గుడిలోకి దక్షిణ భారత వాతావరణాన్ని చిత్రించటానికి మాండలికం సహాయం చేసిందనటంలో సందేహం లేదు. - ముక్తవరం పార్థసారథి
'పెద్దపులి ఆత్మకథ' పేరుతో అనువదించిన ఈ నవలలో పులిపాత్ర కథానాయకుని స్థానంలో కనిపించినా, నిజానికి అది నిర్వర్తించింది సూత్రధారి పాత్రే.  ఇందులో మొదటి భాగానికి కథానాయకుడు ఒక సర్కస్‌ మాస్టరు.  చదువుతున్నంతసేపూ ఆసక్తిని రేకెత్తించి, చివరకు పరమ విషాదంగా ముగిసే పాత్ర అతనిది.  రెండవ భాగానికి నాయకుడు ఒక సర్వసంగ పరిత్యాగి.  ఆ పాత్ర చరిత్ర గౌతమ బుద్ధునితో పోల్చుకునేదైనా, ఆ పాత్రద్వారా రచయిత వెలుబుచ్చిన ఆధ్యాత్మిక భావన గౌతమ బుద్ధుని విశ్వాసాలకు పూర్తిగా వ్యతిరేకమైనదే కాక, బౌద్ధాన్ని కూకటి వ్రేళ్ళలో పెళ్ళగించేందుకు ప్రయత్నించిన శంకరాచార్యులది.  నవలలో ఏదో కొసన కనిపించే ప్రస్తావన సంగతమో అసంగతమో విచక్షించే అధికారం అనువాదకునికి ఉండదు.  తాను ఏకీభవించని కారణంగా వాటిని వదిలేసి మూలానికి ద్రోహం చెయ్యడం సమర్ధనీయంగాదు.  ఇష్టపడకపోతే ఆ పనికే పూనుకోకుండా ఉండాలి. - ఎం.వి.రమణారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good