పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అదరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తకంలో గల ఇరవై ఏడు కథల్నీ చదివి తీరాలి.

    ఒంటరితనానికి ఓదార్పు కలిగిస్తాయి ఈ కథలు. జంటలకి జలకాలాటలనిపిస్తాయి. పిల్లలకు పప్పుబెల్లాలనిపిస్తే, పెద్దలకు బాల్యాన్ని గుర్తుచేసి, అమ్మ గోరుముద్దలనిపిస్తాయి ఈ కథలు. నాన్న కౌగిలి, అత్తఒడి, అక్క దీవెన ఈ కథలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good