మనిషిమీద గొప్ప కరుణ, అభిమానం రాసాని పాత్రల్లో వున్నాయి. ఇవే కాల ప్రవాహంలో రచయితను మాయం చేయకుండా మళ్ళీ స్మృతికి తెచ్చేస్తుంటాయి. నినాదాల జోరే కథాలక్షణం అనుకునే వారి కోవలోకిరాని కథలు వీరివి. అందువల్ల ఒక ప్రత్యేకతను సంతరించుకుని మెప్పు పొందే వీరి కథల నిండా పరచుకొని వుంటుంది. - మునిపల్లె రాజు

రాసాని రాసిన ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితపు రూపురేఖలను మన కళ్ళకు అద్ది బయోగ్రాఫ్‌ను గీస్తుంది. - పెద్దింటి అశోక్‌ కుమార్‌

జన జీవితాన్ని నిశితంగా పరిశీలించి, వాళ్ళ గుండె వెతలను, మంటను, యాసను పట్టుకున్న రాసాని కథారచన విశిష్టమైనది. - కడియాల రామమోహన్‌రాయ్‌

ఎన్నడూ చూడని, ఎరుగని ఇతివృత్తాలు అందిస్తూ, సీమ నుంచి తెలుగు కథకుల సరసన సగర్వంగా నిలబడిన రాసాని చాలా మందిని చాటుకొని ముందుకు సాగారు. సాగుతున్నారు. - చీకోలు సుందరయ్య

దారిద్య్ర రేఖకు దిగువున వున్నవాళ్ళపట్ల, గ్రామాలలో తృణీకరించపడ్డ కులాలవాళ్ళపట్ల రాసానికున్న ఆవేదన గుండెల్ని పిండుతాయి. బండబారిన వాళ్ళను సహితం కరిగిస్తాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good