యెదురు చూడడం కోసం వేచి చూస్తూ...

మనమిక్కడేం చేస్తున్నామన్నదే ప్రశ్న.  మనం అదృష్టవంతులమెందుకంటే దానికి మనకో సమాధాన ముంది.  అవును, ఈ అంతులేని అయోమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా వుంది.  మనం రాబోయే గోడో కోసం యెదురుచూస్తున్నాం.

శామ్యూల్‌ బెకెట్‌ 'వెయిటింగ్‌ ఫార్‌ గోడో'లో  వ్లాడిమర్‌...

ఈ రోజు ఉదయం నుంచీ చీకటిలాంటిదేదో నా కళ్లను కమ్మేస్తున్నట్టనిపిస్తోంది.  అంతా ఓ కలగా అనిపిస్తోంది.  ప్రశాంతత కోసం ప్రాకులాడుతున్నాను.  రాజుగారి ఉత్తరం వస్తుందా రాదా? - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 'పోస్టాఫీస్‌'లో అమల్‌...

ఆ యింట్లో వుండే ఆ సావుకారు దేవుడయ్య కోసరం పడిగాపులు పడతా వుండాడు.  నేను కూడా ఒక దేముడయ్య కోసరం యెతుకులాడతా వుండాను. - బుడబుక్కలవాడు 'యింద్ర ధనస్సు'లో...

జరుగుతున్నది ఒక్కటే - ఒక నిరంతరమైన యెదురుచూపు.  యెవరి కోసం, యెక్కడ, యెప్పుడు, యెలా - అన్నీ ప్రశ్నలే.  సమాధానాలు కవ్విస్తాయి. పాఠాంతరాలే మిగులుతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good