దేశీయ, విదేశీయ, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల కలర్ ఫొటోలతో - ఆయుర్వేద, చిట్కా, రసవైద్యం, హోమియోపతి, అల్లోపతి, జానపద  చికిత్సల సంకలనమే ఈ పుస్తకం.
ఈ పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. పశు పోషణ, టీకాలు వేసే సమయం, రోగ లక్షణాలు మరియు రోగములకు మందులు వివరించబడ్డాయి. ఒక్క ప్రాంతంలో కొన్ని వైద్య విధానాలకు సంబంధించిన మందులు దొరుకుతాయి. కొన్ని సమయాలలో కొన్ని మందులు దొరకక పోవచ్చును. అర్థరాత్రి మందు అవసరం పడవచ్చు. ఇటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వైద్య విధానాలలోను, రోగాలకు సరిపడా మందులను సూచించారు. ఇదేకాక అతిసులువుగా మీ ఊర్లో దొరికే ఔషధ మొక్కలతోనే వైద్యం చేసుకొనే విధంగా మూలికా వైద్యం కూడా చెప్పబడింది.
నా అనుభవంలో ఏ వైద్య విధానం యొక్క గొప్పదనం దానికి ఉంది. అందుచే ఎవరికి నచ్చిన విధానంలో డాక్టర్ గారి సూచన మేరకు ఈ పుస్తకాన్ని వినియోగించు కుంటారని ఆశిస్తున్నాము.  - నడిమింటి సీతారామశాస్త్రి

Write a review

Note: HTML is not translated!
Bad           Good