వైవిధ్య భరితమైన ఈ భూమండలం పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉంది. పర్యావరణ పరిరక్షణ అంటే ప్రకృతిని కాపాడటం. ప్రకృతిని కాపాడటమంటే మనిషితో బాటు ఇతరజీవులను పరిరక్షించాలి. కాని మనిషి స్వార్ధపూరిత ఆలోచనలు, చేతలు మూలంగ తనతో బాటు ఇతరజీవులకు హాని కల్గిస్తూ పుడమితల్లి వినాశాన్ని కోరుకోవడం తన ఉనికికే ప్రమాదమని తెలుసున్నా, ప్రకృతి వనరులను దోచుకోవడం మానలేదు.

ప్రకృతి పరిరక్షణ కంటే కూడా, ఈరోజు మనిషి వాణిజ్య విలువలకే పట్టంకడ్తున్నాడు. అధికోత్పత్తి ప్రధానలక్ష్యంగ జన్యుమార్పిడి పంటలపట్ల ఆసక్తి చూపుతున్నాడు. జన్యుమార్పిడి పంటలు విషతుల్యాలు. ప్రస్తుతం ఇవి 29 దేశాల్లో సాగవుతున్న, ఈ పంటల వల్ల జరిగే అనర్ధాలపై లోతైన అధ్యయనాలు విస్తృతంగా నిర్వహించకుండా, వాటిని వాడటానికి అనుమతిస్తే... భవిష్యత్‌లో పర్యావరణం మరింత దెబ్బతినే అవకాశం వుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good