నేను క్షణాల్ని గడ్డకట్టించి అక్షరాలుగా మారుస్తున్నాను. కాలాన్ని గడ్డకట్టించి కావ్యంగా మారుస్తున్నాను. అక్షరాల గుండా కావ్యంగా ప్రవహిస్తున్న పవిత్రాత్మను నేను.

భావి తరాల మన:కుంపట్లపైన ద్రవమై కరిగి, ఆవిరియై విశ్వాన్ని ఆవరిస్తాను. ఆగమన మానవలోక హృదయనికుంజాలే నా స్థిర స్తావరాలు. నేను వర్షించే అక్షరాల జల్లులో మానవ మన:ధూళి తడిగ్రహించి సతతహరిత శాద్వల భూముల్లో తానొక్కటే తానొక్కటిగా విరాజిల్లే గడ్డిపోచ నా అనుయాయి. నా కామ్రేడ్‌, ఒక్కడే ఒక్కడైననావాడు, నా వారసుడు, ప్రియాతిప్రియమైన నా భావి మానవుడు.

కావి వలువలు కట్టి, కానలలో కాయాల వివేచనాన్ని కాల్చి, కాంతిని కాలాంతములకాస్పారించిన నా పూర్వుల నుంచీ, ధవళవస్త్రధారులై అమందానంద ధామాలలో అనంత సత్యావిష్కరణోత్సవంలో, చరిస్తున్నా చరించని జంగమ జగత్తులో, చరించకపోయినా చరిస్తున్న జడమహత్తులా, ఆత్మప్రదక్షిణలు సాగిస్తూ కాంతి మండలాలై అవతరించే భావితరాలలోకి, ప్రవహిస్తున్న పరావర్తనం చెందుతున్న వక్రీభవస్తున్న వీస్తున్న కాలమనే కావ్యాన్ని నేను...

Write a review

Note: HTML is not translated!
Bad           Good