పారిస్‌ కమ్యూన్‌

స్థాయీ సైన్యమూ, పోలీసులూ, నిరంకుశాధికారులూ, మత గురువులూ, న్యాయాధికారి వర్గమూ – అనే శ్రమ విభజనాంగాలతో కూడినదే కేంద్రీకృత రాజ్యాధికారం.

కార్మిక వర్గం ఒక సారి అధికారంలోకి వచ్చిందంటే, అప్పుడిక అది, పాత రాజ్యాంగ యంత్రంతో వ్యవహారం సాగించలేదన్న వాస్తవాన్ని ఆదిలోనే తప్పని సరిగా గుర్తించాలి. అప్పుడే సాధించుకున్న తన ఆధిపత్యాన్ని మళ్ళీ పోగొట్టుకోకుండా ఉండాలంటే, ఈ కార్మికవర్గం, ఒక వంక, ఇంతకుముందు తనకే వ్యతిరేకంగా వాడబడిన పాత నిర్బంధ యంత్రాంగానిన తొలగించి వెయ్యాలి. మరో వంక, తన ప్రతినిధుల, తన అధికారుల విషయంలో జాగ్రత్త తీసుకుని, వాళ&ందరూ కూడా, ఎటువంటి మినహాయింపూ లేకుండా, ఏ క్షణం లోనైనా వెనక్కి పిలిపించబడగలరని ప్రకటించాలి.

శ్రమ సాధనాలన్నింటినీ ఉత్పాదకులకు బదిలీ చేసి, తద్వారా ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరూ తన జీవిక కోసం విధిగా పని చేసేలా చేసి, తద్వారా ప్రస్తుతం అమల్లో ఉన్న పీడన పరిస్థితులను రూపు మాపినప్పుడే, వర్గ పాలనకూ, పీడనకూ గల ఏకైకా ప్రాతిపదిక తొలగిపోతుంది.

కమ్యూన్‌, మానవ జాతిని, వర్గ సమాజం నుండి శాశ్వతంగా విముక్తం చేసే మహత్తర సామాజిక విప్లవ ఉషోదయం.!

పేజీలు : 159

Write a review

Note: HTML is not translated!
Bad           Good