ఒక పుస్తకాన్ని సమీక్షించటం ద్వారా, ఆ పుస్తకంలోని అంశంపట్ల, ఆసక్తిని, అనురక్తిని, అవగాహనని కలిగించటంలో సింగమనేని గారు దిట్టని చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో చేసిన 16 పుస్తక సమీక్షలు, పాఠకులు పుస్తకాన్ని చదవటానికి తగిన భూమికను సిద్ధం చేస్తాయి. ఒక పుస్తకాన్ని చదవటం వల్ల మనం ఏం తెలుసుకోగమో, ఆలోచించగలమో, ఆచరించగలమో, అనుభూతి చెందగలమో, అర్థం చేసుకోగలమో, స్ఫూర్తిని పొందగలమో, ప్రయోజనం పొందగలమో అవగతమయ్యేలా సమీక్షించటం సింగమనేనిగారి విశిష్టత. పాఠకులు తమతమ అభిరుచులకు తగిన పుస్తకాలను నిస్సందేహంగా ఎంచుకోవటానికి ఉపయుక్తమైఔన సమీక్షలు సింగమనేనిగారివి. రచయితగా ఆయనెంత గొప్ప సృజనకారుడో, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, సమీక్షకుడిగా అంతటి సమున్నత ప్రజ్ఞాశాలి.

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good