పిల్లల పెంపకం - రుగ్మతలు - పరిష్కారాలు
చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకోవడం పిల్లలకు అలవాటు, తరచూ అందుబాటులో ఉండే బొమ్మలైతే మరీనూ. పిల్లలు ఆడుకునే వస్తువులు ఆకర్షణీయ రంగుల్లో ఉంటాయి. ఈ రంగులు అద్దేందుకు తయారీదారులు పాలివినైల్ క్లోరైడ్‌ను కలుపుతారు. ఇదే పిల్లల్ని అపాయంలోకి నెడుతుంది. అలాగే వీటిలో ఉండే లెడ్, కాడ్మియం రక్త ప్రసరణ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల పిల్లలు మానసిక వికలాంగులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. కేన్సర్, ఎముకల బలహీనత, కిడ్నీలు చెడిపోవడం వంటి రుగ్మతలకు ఇది కారణం కావచ్చు. వినికిడి లోపంతో పాటు పిల్లల ఐక్యూ దెబ్బతినే ప్రమాదం ఉంది. నరాల బలహీనతతో పాటు ఒక్కోసారి ప్రాణామ మీదకు వస్తుంది. 'విషతుల్యం కాని బొమ్మలు' అని లేబుల్ ఉన్నప్పటికీ వాటి నాణ్యతను నిర్ధారించుకోవాలి. నాణ్యమైన ఉత్పాదనలు కాకుంటే అనారోగ్యం తప్పదు.