ఝాన్సీ లక్ష్మీబాయి జీవించి, పోరాడిన రోజులు గడిచిపోయి నూటాయాభై సంవత్సరాలయింది. ఆమె ఏ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిందో, ఆ పోరాట ఫలితంగానే ఏడాది తిరక్కుండానే ఆ ఈస్టిండియా కంపెనీని తప్పించి స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వ పాలన మొదలయింది. ఈ పాలన కూడా ముగిసిపోయి నల్లదొరలకు అధికార మార్పిడి జరిగి ఆరున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ పుస్తకరచన జరిగి యాభై సంవత్సరాలు గడచిపోయాయి. ఇన్ని మార్పులు జరిగినా, కాలం చాలా ముందుకు జరిగినా, ఆ పోరాటానికి, ఈ పుస్తకానికి ప్రాసంగికత, ప్రాధాన్యత, అవసరం తగ్గిపోలేదు సరికదా, రోజురోజుకూ పెరుగుతున్నాయి. విభిన్నరూపాలలో కొనసాగుతున్న పరాయిపాలన దోపిడీ పీడనలను ఎదిరిస్తూ వీరోచితమైన, త్యాగభరితమైన, ఆశౄవహమైన ప్రజాపోరాటాలు ఇవాళ కూడా సాగుతున్నాయి. అందుకే ఇవాల్టికీ ఝాన్సీలక్ష్మీ బాయి పోరాటం గురించీ, ఆ పోరాట జ్ఞాపకాల గురించీ ఆలోచించవలసిన, తలచుకోవాల్సిన విషయాలు మిగిలే వున్నాయి.

Pages : 238

Write a review

Note: HTML is not translated!
Bad           Good