పశుసంపదపై వచ్చిన అరుదైన నవల 'పరస'.
నవలలోని కథ చాలా చిన్నది. ఒక చిన్న గ్రామం. ఆవులు, ఎద్దులు, గంగిరెద్దులు, మేకలు, గొర్రెలు, మనుషులు ఉంటారు ఆ ఊళ్ళో. మనుషుల్నీ పశువుల్నీ విడదియ్యడానికి వీల్లేదు. పొద్దు పుట్టిందగ్గర్నుంచి నిద్రపోయేదాకా పశువుల జీవితాలు మనుషుల జీవితాలు ముడిపడే ఉంటాయి. ఈ మధ్యన ఎన్నెన్ని సంఘటనలు! మనుషుల్లో ఎన్నెన్ని వికృతమైన ఆలోచనలు!
పశువుల్ని కొనడానికి కొన్ని ఊళ్ళలో పరసలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ పరసలు పశువులకే కాకుండా మనుషుల కోసం కూడా జరుగుతున్నాయి. ఈ మనుషుల పరసలు ప్రతి ఊళ్ళోను, ప్రతిరోజూ జరుగుతున్నాయి అని రచయిత తీర్మానిస్తాడు.
''ప్రతి జనావాసమూ పరసే...ప్రతి నగరము...ప్రతి దేశము పరసే... ఈ లోకమే పెద్ద సంత. మనుషుల సంత. పశువుల పరసలో కొనేది, అమ్మేది మనుషులే. అమ్ముడు పోయేది మాత్రం పశువులు. ఇది ఏనాటి నుంచో వస్తున్న పద్ధతి. కానీ ఈ మనుషుల సంతలో అమ్మేవాళ్ళు, అమ్ముడుపోయేవాళ్ళు, వ్యాపారులు, దళారులు అందరూ మనుషులే'' అనే వాక్యాలతో ''పరస'' నవల ముగుస్తుంది.
గ్రామీణ జీవితంతో అనుబంధం లేని వ్యక్తులు ఈ నవలలోని కనుమరుగవుతున్న జీవన దృశ్యాలను చదివితే ఒక క్రొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. - నాయుని కృష్ణమూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good