తమ శ్రమ ఫలం దక్కనివారు మన సౌందర్యాల మీద తిరగబడితే,
మన బంగళాలు పగలకొడితే అందుకోసం వారికి పలుగులిద్దామా?
పారలిద్దామా? మరి మన ఆరాటాలూ, పోరాటాలూ దేని కోసం?
ఆమె చరిత్ర నిర్మాణంలో పాల్గొనడం వల్ల సమకాలీన రాజకీయ చరిత్రను వ్యాఖ్యానించగలిగింది. చరిత్ర నిర్మాణంలో తాను ఓ భాగమైంది. కనుకనే తన భాగస్వామ్యం కల చరిత్రను ఉన్నదున్నట్టు చెప్పగలగింది. అది విప్లవకార్యాచరణ వల్లే సాధ్యమైంది.
కుటుంబం వ్యవస్ధకు చిహ్నాలు వంటిళ్ళే. ఆడవాళ్ళకు బతుకంతా బంధంగా వాళ్ళ ఆలోచనలూ, శ్రమ, మేధాశక్తీ వంటిళ్ళ పాలై వారే వంటిళ్ళకు ప్రతి రూపాలుగా మారిన ఈ దశలో వంటిళ్ళు పోనిదే స్త్రీలకు విముక్తి లేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good