తలపగులగొట్టి విద్యాగ్రంధాలను వెలికితీయుట
కళింగదేశంలో సుమనోహరంగా ప్రకృతి కాంత ఒడిలో ఓలలాడిన మహేంద్రగిరులను దివినుంచి ఇంద్రధనస్సుల్లా దిగి ఆకాసంలో విహరిస్తున్న మెరుపుతీగల్లాంటి గంధర్వకన్యలు చూసి అబ్బురపడ్డారు. ఎటు చూసినా నింగిని తాకే వటవృక్షాలు వాటి పచ్చదనం, జలపాతాల సోయగాలు, ఆ గిరులను చూడటానికి రెండు కన్నులు చాలవు అన్నట్లు కన్నులు విశాలం చేసి చూసారు. పంచపాండవుల ఆలయాలను చూసి అబ్బ ఎంత రమణీయంగా ఉంది ప్రకృతి. మన ఊహ తప్పుకాలేదు. పదండి. ఆ కన్పిస్తున్న తటాకంలో స్నానం చేసి ఆ పంచపాండవుల ఆలయాలను దర్శనం చేసుకుందాం అని కూడపలుక్కుని మరీ ఉత్సాహంగా చలిభయం వదలి నింగిలోంచి కిందకి ఆత్రంగా ఆనందంగా దిగారు. ఆ రోజు శివరాత్రి పర్వదినం. గిరజనులు సాయంత్రానికి ఆగిరులను అతికష్టంతో అధిరోహించి తాము నమ్మిన ఆపంచపాండువుల గుడులను దర్శించి శివరాత్రి జాగరణ చేయడం ఓనమ్మిక. ఈ పద్ధతి ద్వాపరయుగం నుంచి వస్తున్నది. ఆ విషయం గంధర్వకన్యలు గుర్తు చేసుకుని మరీ నరుల దృష్టిలో పడకుండా ఒంటిమీదున్న వస్త్రాలను విడిచి తటాకంలో దిగి తనివితీరా స్నానం చేయసాగారు. అలా ఎంతసేపు చేసారో తెలియనంతగా 

Write a review

Note: HTML is not translated!
Bad           Good