మీకెప్పుడైనా పరాజయం సంభవించిందా? ' జీవితం మోసగించిందా?

'గడ్డుకాలాలు కృంగదీశాయా? ' మీ పరాజయాలను అపూర్వమైన విజయాలుగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?

అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకం, నీ జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలు, రాసిన విలీ జాలీ, పరాజయం విజయానికి సోపానం, అనే ఈ పుస్తకంలో మీరు కృషి చేయ్యడానికి, మీ లక్ష్యం సాధించుకోవడానికి స్ఫూర్తినిస్తాడు. వి.డి.ఏ.డి. ఫార్ములా - ముందుచూపు, నిర్ణయం, చర్య, కోరిక - జీవితంలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఎలా తోడ్పడుతుందో చూపిస్తాడు. మీ అదృష్టం పగ్గాలు మీ చేతుల్లోనే ఉంచుకోవడానికి సాయపడే తన టెక్నిక్‌లను మీతో పంచుకుంటాడు. కష్టాల ముందు తలవంచని, అనుకోని ప్రదేశాలలో అవకాశాలు అన్వేషించిన సాధారణ వ్యక్తుల అనుభవాల గురించి చెపుతాడు. మనోరంజకమైన ప్రసంగాలు, ఉదాహరణలు, కథలతో మీరు మీ శక్తులను కేంద్రీకరించి, కార్యోన్ముఖులు అయ్యేలా చేస్తాడు. విలీ ప్రతిపాదించిన పన్నెండు సరళమైన వ్యూహాలను ఉపయోగించి, మీరు మీ పరాజయాలను విజయాలుగా, సమస్యలను సంభావ్యతలుగా మార్చుకోగలరు. ఇది నిజంగా ఒక 'ప్రేరణాత్మకమైన ఉత్తమ రచన!' విలీ జాలీ, 'ఈ సంవత్సరంలోని ఒక విశిష్ట స్ఫూర్తిదాయక వక్త'. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good