మానవ శరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగ ప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్దమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథ రచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది.

ఈ శక్తి మానవ శరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్బుతమైన విషయాలను వెల్లడిస్తుంది. అందువలన ఈ పుస్తకంలోని కొన్ని బాగాలలో వ్రాసిన విషయాలు అతి అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి. అంతే గాకుండా ఈ విషయాలు మనస్సులో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి సవాలుగా నిలచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధానమిస్తుంది.

ఈ గ్రంథం సమాజంలోని అన్ని వర్గాలవారి కోసం వ్రాయబడినది. మత వ్యవస్థలకు మరియు సామాజిక భేదాలకు అతీతంగా మానవజాతి శ్రేయస్సు కోసం వ్రాయబడినది. ఈ గ్రంథంలో బహిరంగపరచిన యోగరహస్యాలు, పరమానందం మరియు శాశ్వతమైన శాంతి కోసం వెదుకుచున్న ఏమానవునికైనా ఉపయోగపడగలవు.

పేజీలు : 226

Write a review

Note: HTML is not translated!
Bad           Good