భూలోక సౌందర్యం ఇదివరకెన్నడూ లేనంత విశిష్టంగా కొత్తకోణాల్లోంచి కనిపిస్తోంది, రాముడికిప్పుడు. జీవి ఆశ్రయం పొందగలిగిన ఒకే లోకం భూమి. జీవికి చావు పుట్టుకలున్నాయి. కానీ, జీవజాతికి మరణం లేదిక్కడ. చెట్టు పుష్పిస్తుంది. పరాగం ఫలిస్తుంది. చెట్టు మోడై చచ్చు బారినా, పరాగ సంపర్కవేళ అది పొందిన ఆనందానుభూతితో దాని జన్మ ధన్యమవుతుంది. యుగాలు గడిచినా దాని గురుతులు పచ్చగా పల్లవిస్తూనే వుంటాయి. లేకపోతే ఆ అంచె తెగిపోదూ? భూగోళం మృత ప్రాయమైపోదూ? పరాగభరితంగా పరిమళించడం కోసమే ప్రాణి పుట్టుక. ప్రాణి మనుగడ కోసమే పరాగోత్పత్తి! మొగ్గల్ని గిల్లేది విధి కాదు. పుప్పొళ్ళు చిమ్ముకోవద్దని శాసిస్తే పువ్వులు వినవు. ఆనందం పంచుకునే ఈడుకొక జోడు లేకపోతే జీవితం ఎందుకు? ఈ భూమికి పూజ్యత ఎందుకు?

Pages : 220

Write a review

Note: HTML is not translated!
Bad           Good